29-08-2025 04:46:40 AM
పెద్దపల్లి, ఆగస్టు 28 (విజయక్రాంతి)/అంతర్గాం: తెలంగాణ రాష్ట్రానికి ఎల్లం పల్లి ప్రాజెక్ట్ గుండెకాయ వంటిదని, ఇక్క డి నుంచి గోదావరి జలాలను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా తరలించే వీలుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. వ్యూహాత్మక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్ట్ శ్రీపాద ఎల్లంపల్లి అని.. కూలిన ప్రాజెక్ట్, నిలబడిన ప్రాజెక్ట్‌కు తేడా ఉం టుందన్నారు. నిపుణులు నిర్మించడం వల్లే శ్రీపాద పదికాలాల పాటు మనగలిగిందన్నారు.
భారీవర్షాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలు నీట మునగగా, సీఎం గురువారం హెలిక్యాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను సంద ర్శించి గోదావరి మాతకు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రామ గుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో, ప్రస్తుతం బరాజ్‌లో నిల్వ ఉన్న నీరు తదితర వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
మేడిగడ్డ పనికిరాకుండా పోయింది.. ఆ బరాజ్‌ను రిపేర్ చేయకుండా.. అన్నారం.. సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చుగా అన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘అతి తెలివితేట లతో మామ, అల్లుడు.. ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆణిముత్యం అను కుంటారు. మేడారం, అన్నారం, సుంది ళ్ల.. మూడు బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పో యాలి.
అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. మూడు బ్యారేజీల డిజైన్‌లో, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. అనుకోని ప్రమాదం జరిగితే గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి. మేం 80 వేల పుస్తకాలు చదువలేదు. ఏం చేద్దామో 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నాం. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల మేరకు ముందుకెళ్తాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తాం’ అని రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు.
ప్రాజెక్ట్ నిర్వహ ణ పకడ్బందీగా ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సం బంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. వరద పెరిగే అవకాశం ఉన్న నేప థ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసర మైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చే శారు.
అనంతరం కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను సం దర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్ గు ప్తా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణు, ఆర్డీ వో గంగయ్య, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.