29-08-2025 03:31:57 AM
ఇల్లెందుల దుర్గాప్రసాద్ :
ప్రకృతి సంకేతాలను నిర్లక్ష్యం చేసినా, నిర్లిప్తంగా మెదిలినా, భక్తి శ్రద్ధ, గౌరవాలను విస్మరించినా అనర్థాలు తప్పవనే చర్చలు కొత్త కాదు. కానీ నూరేళ్ళకో, 30 ఏళ్లకో ఇంతటి వరద విశ్వరూపాన్ని చూశామని బురద ఎండిపోయే దాకా కొన్ని దినాలు చెప్పుకొని అంతటితో వదిలేస్తే, మరలా తీరని వరదల నష్టం సంభవించదనే హామీని ఎవరూ ఇవ్వలేరు.
సముద్ర జలాలు లేని తెలంగాణ వరద జలాలతో శోక సంద్రమైం ది. కామారెడ్డిలో మొదటి అంతస్తు భవనాలను వరద నీరు ముంచేయడం ఏమిటీ? కామా, ఫుల్ స్టాప్ లేని వరదలు ఏ ప్రదేశాన్నయినా ఎపుడైనా తీవ్ర ఉదృతితో కబళించొచ్చనే సంకేతాలేనా? అనేవి విస్మ య ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఈ ప్రశ్నలకు అనేక జవాబులు, విశ్లేషణలు, కారణాలు, వాదనలు రకరకాలుగా పోటెత్తుతున్నాయి. కామారెడ్డి, మెదక్, ములు గు సహా అనేక చోట్ల వరద గాయం 360 డిగ్రీల్లో మామూలుగా లేదు.
ఎక్కడికక్కడ మానవ స్వార్థాలు, తప్పిదాలకు తోడు లో పభూయిష్ట విధానాలు స్ఫురణకు రావొ చ్చు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా రెండు రోజుల్లోనే సాధారణ వర్షపా తా నికి అనేక రెట్లు అధికంగా కుండపోత కురిసింది. అది గణాంకాల్లో 60 సెంటీ మీట ర్ల మేర అయినప్పుడు ఎవరేం చేస్తారనే నిట్టూర్పులూ పారొచ్చు. నీటి కోసం రా ష్ట్రాల మధ్యరా జుకున్న వివాదాల ధ్వని వినిపిస్తుండగానే.. ఎటుచూసినా అదే నీరు ఏరులై పారి నేలను, ఆస్తులను, పంటలను ముంచెత్తడం చూస్తున్నాం.
ఉదాహరణకు మనం బండిని సరిగ్గా నడిపిస్తే అది మన ల్ని క్షేమంగా గమ్యానికి చేరుస్తుంది. అయి తే అదే బండిని సక్రమంగా నడపకుండా, విచక్షణకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారీతిన వాడేస్తే ఏదో ఒక ఘడియలో మొరాయిస్తుంది. సకాలంలో చేర్చాల్సిన చోటుకు చే ర్చకపోగా, ఆ బండిని తిరిగి మనమే మో యాల్సి వస్తుంది. వర్షం, వరదల నిర్వహణపై మనకు సోయి ఎలా ఉండాలనేది చె ప్పేందుకు ఈచిన్న థియరీచాలు.
ప్రకృతి సంకేతాలను నిర్లక్ష్యం చేసినా, నిర్లిప్తంగా మెదిలినా, భక్తి శ్రద్ధ, గౌరవాలను విస్మరించినా అనర్థాలు తప్పవనే చర్చలు కొత్త కాదు. కానీ 30 ఏళ్లకో, నూరేళ్లకో ఇంతటి వరద విశ్వరూపాన్ని చూశామని బురద ఎండిపోయే దాకా కొన్ని దినాలు చెప్పుకొని అంతటితో వదిలేస్తే, మరలా తీరని వరదల నష్టం సంభవించదనే హామీని ఎవరూ ఇవ్వలేరు. తాత్కాలిక, సమీప, దీర్ఘకాలిక ప్రణాళికల యుక్తి కచ్చితంగా ఉండాలి.
పాలకులు ఏం చేస్తున్నట్టు?
పాలకులు, ప్రతిపక్షాల పరస్పర నింద లు వేసుకోవడం చూస్తూనే ఉంటాం. వారి మాటల కుండపోతలకు తక్కువేం ఉండ దు. పదేళ్ళలో వారేం చేశారంటే.. ఎక్కువ కాలం పాలించిన, ఇపుడూ పాలన చేస్తున్న వారిదే పాపం అనే సారాంశంగా మాటకు మాట పోటెత్తుతుంది. ఈ రొటీన్ తీరుకు నీరొదిలి.. నీళ్లను కాపాడటానికి అదే సమయంలో ఇలాంటి గండాలు పునరావృతం కాకుండా ఉపాయాలు యోచించాలి.
మ న పాలకుల విధానాలు భలే ఉంటాయి. రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టుల కట్టడంపై చూపించినంత ఆసక్తి.. ఇప్పటికే ఉన్నవాటి నిర్వహణ కోసం వెచ్చించడానికి మాత్రం మనసు రాదు. వందకు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న పోచారం డ్యామ్‌ను ఈసారి అత్యధిక వరద ముంచెత్తింది. సు మారు 1.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నట్టు ఓ అంచనా. ఇలాంటి జలాశయాల పటిష్టానికి మాత్రం నాయకులు ముందుకు రారు.
మేఘ విస్ఫోటన ప్రభావం..
మరో పక్షం రోజుల్లో వర్షాకాలం ము గుస్తుందనగా వరదలు కొత్త దారులను వెతుక్కోవడం చూస్తున్నాం. తెలంగాణలో గడిచిన 48 గంటల్లో ఆయా చోట్ల 200 మి.మీ. నుంచి 440 మి.మీ. వరకు వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు జలాశయం సామర్థ్యం సుమారు 2 టీఎంసీలు. అలాంటి ప్రాజెక్టులకు సరిపడా ఎన్నో టీఎంసీల నీరు దారి తప్పి వృథా అవడమే కాకుండా అనేక కష్టనష్టాలను చుట్టు ముట్టించింది.
రాష్ర్టంలో గడిచిన రెండు రోజుల్లో మొత్తంగా సగటున 29.1 మి. మీ. వర్షపాతం రికార్డయింది. ఆగస్టు 21 నుంచి 27 వరకు వారం రోజుల్లో చాలా జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం నమోదైంది. ఆగస్టు సాధారణ సగటు వర్షపాతం సుమారు 210 మి.మీ. (ఒక నెల మొత్తం) కాగా.. గత రెండు రోజుల్లో కురిసిన వర్షం చూసుకుంటే దాదాపు 3-4 రె ట్లు ఎక్కువగా ఉంది. కామారెడ్డి, మెదక్, ములుగు జిల్లాల్లో 200 నుంచి -400 మి. మీ. వరకు పెద్ద మొత్తంలో వర్షం కురిసింది.
ఇది సాధారణంతో పోలిస్తే 10 రె ట్లు ఎక్కువ. కామారెడ్డి జిల్లాలో బుధవా రం ఆర్గొండలో 418.3 మి.మీ., రాజంపేటలో 440. 5 మి.మీ. వర్షం, కామారెడ్డి టౌన్‌లో 308. 5 మి.మీ, భిక్‌నూర్‌లో 238 మి.మీ., లింగంపేటలో 120.3 మి. మీ., టెక్మాల్‌లో 183.3 మి.మీ., హవేలీఘనపూర్‌లో 316 మి.మీ. వర్షపాతం నమో దైంది. ఇది కచ్చితంగా సాధారణ వర్షాలు మాత్రం కావు. గత కొన్ని రోజులుగా మే ఘ విస్ఫోటం అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. రెండు నుంచి 4 గంటల్లో ఒకే ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవ్వడాన్ని మేఘ విస్ఫోటం అని పిలుస్తారు. ఇలాంటివి ప్రకృతి వైపరీత్యాల వల్లే ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఉపాయాలు అవసరం
బెంగాల్ బేలో ఏర్పడిన సైక్లోనిక్ స ర్క్యులేషన్ కారణంగా తెలంగాణలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నివాస ప్రాం తాలు, రవాణా మార్గాలు, రైల్వే లైన్లు, కాలువల గుండా తీవ్ర వరదలు సంభవించాయి. అనేక నివాసాలు, వాహనాలు, రోడ్లు, పంటలు, సామాజిక ఆస్తులు ప్రభావితమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎ ఫ్ సహాయక బృందాలు కాపాడటం లో నిమగ్నమయ్యాయి.
విపరీత వర్షాలు వ చ్చిన సమయంలో సమాజానికి ఇబ్బంది లేకుండా, అలాగే వరద నీరు వృథా కా కుండా ఆ నీటిని ఒడిసిపట్టుకునే ఉపాయాలపై నిరంతరం దృష్టి ఉంచాలి. నాలా ల పునరుద్ధరణ, కాలువల్లో వ్యర్థాలు, ఆక్రమణల తొలగింపు వంటి సంస్కరణలతో జల ప్రవాహాలను సులభం చేయాలి. రాజధాని మొదలు చిట్ట చివరి టౌనూ, మం డలం వరకూ ఆసాంతం ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ప్రణాళికా యుక్తి కావాలి.
వ్యాసకర్త సెల్: 9440850384