29-08-2025 05:59:44 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారు. ‘దేశంలో ప్రతి ఒక్కరు 2.1 పిల్లలను కనాలని పాలసీ చెబుతోంది. ఇది దేశ సగటు. ఈ లెక్కన ప్రతి జంటకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి. దేశాన్ని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నా దేశంలో జనాభా సరిపడేంత మంది ఉండాలి.
అలాగే నియంత్రణలో ఉం డాలి. గణితంలో 2.1 అంటే 2గా లెక్కిస్తారు. అదే జననాల విషయానికి వచ్చే సరికి 2.1 అంటే మూడు. డాక్టర్లు నాతో ఇదే విషయం చెప్పారు. ప్రస్తుతం జననాల రేటు తగ్గుతోం ది. సరైన సమయంలో పెళ్లి చేసుకుని ముగ్గు రు పిల్లల్ని కనాలి. ముగ్గురు పిల్లలు ఉండ టం వల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఆహారం పెట్టాలనే జనాభా నియంత్రణ విధానం తీసుకొచ్చారు.
కుటుంబాలు ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. అంతకు మించి ఉంటే జనాభా నియంత్రణ లో ఉండదు. వారి పెంపకాన్ని సరిగా చూసుకోవడానికి ఇది అవసరం. ‘విదేశీ వాణి జ్యంలో స్వావలంబన, స్వదేశీ పద్ధతులు చాలా ముఖ్యం. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలి. అందులో ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. స్వదేశీ పద్ధతులు పాటించా లి. మనం ఎటువంటి ఒత్తిడికి లొంగకూడదు. ఆర్‌ఎస్‌ఎస్ స్వావలంభనతో పాటు దేశీయ సంస్కృతిని పెంపొందిస్తుంది.
బీజేపీతో కొన్ని పోరాటాలు మాత్రమే ఉన్నాయి. ఎటువంటి గొడవలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేస్తాం. ప్రభుత్వ విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోం. తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్టీకే ఉంటుంది. దేశాన్ని నడపడంలో వారు సిద్ధహస్తులు. మేము కాదు. కేంద్రం, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలతో కూడా సత్సంబంధాలు నిర్వహిస్తాం.
ఏ వ్యవస్థలోనైనా పోరాటాలు సహజం. అవి గొడవలుగా మారకూడదు. నేను రిటైర్ అవుతా. వేరే వారు కూడా రిటైర్ కావాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఒక వేళ నాకు 8 0 ఏండ్లు వచ్చిన తర్వాత సంఘ్‌ను నిర్వహించమని కోరితే నేను తప్పక నిర్వహిస్తాను. సంఘ్‌కు అవసరం అయిన మేర సేవలందించేందుకు సిద్ధంగా ఉంటాం. ఆర్‌ఎస్‌ఎస్ ఎవరి మీదా దాడి చేయాలని విశ్వసించదు. రోడ్లు, ఇతర ప్రాంతాలకు ముస్లింల పేర్లు పె ట్టొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ దు రాక్రమణదారుల పేర్లు పెట్టొద్దు అని మాత్ర మే చెప్పా’ అని ఆయన పేర్కొన్నారు.