6 March, 2026 | 6:20 PM

వైద్య సేవల్లో సాంకేతిక విప్లవం

06-03-2026 02:19 AM

ఎమ్మెల్యే మల్లారెడ్డి చేతుల మీదుగా ‘వన్ హెల్త్ అంబులెన్స్’ ప్రారంభం

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో అత్యవసర వైద్య సే వల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశ గా ఒక కీలక అడుగు పడింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి ‘వన్ హెల్త్ అంబులెన్స్‘ సేవలను అధికారికంగా గురువారం ప్రారంభించారు. కోటికి పైగా జనాభా, 500కు పైగా ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్‌లో ప్రస్తుతం ప్రతి 37,000 మందికి ఒక అంబులెన్స్ మాత్ర మే అందుబాటులో ఉంది.

దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ రావడానికి 40 నుండి 50 నిమిషాల సమయం పడుతోం ది. ఈ అంతరాన్ని పూరించడానికి, వేగవంతమైన, నమ్మకమైన సేవలను అందించడా నికి ‘వన్ హెల్త్ అంబులెన్స్‘ ముందుకు వచ్చింది. ప్రజలకు తక్షణమే అందుబాటు లో ఉండేలా ప్రత్యేక అత్యవసర నంబర్ 9734 108 108 ను విడుదల చేశారు. హైదరాబాద్ అంతటా అంబులెన్స్ సేవల కోసం పౌరులు నేరుగా ఈ నంబర్కు కాల్ చేయవచ్చు.

మల్కాజ్గిరి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బాచుపల్లి, మణికొండ, షామీర్పేట, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, మియా పూర్, పంజాగుట్ట వంటి ప్రాంతాలలో ఈ అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘అత్యవసర వైద్య సేవ అనేది వేగం, ఖచ్చిత త్వం, అంకితభావంతో కూడిన బాధ్యత. సమాజానికి నమ్మకమైన, సకాలంలో అత్యవసర మద్దతు అందించేలా వన్ హెల్త్ అం బులెన్సన్ను రూపొందించాం.‘ అని ఆయన తెలిపారు. వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. ‘అత్యవసర సమయంలో మొదటి కొన్ని నిమిషాలు చాలా కీలకం.

మా శిక్షణ పొందిన బృందాలు, లైవ్ ట్రాకిం గ్, సాంకేతిక వ్యవస్థలతో సహాయం కోరిన క్షణం నుండే వృత్తి పరమైన సంరక్షణను అందిస్తాము అని తెలిపారు. మల్లారెడ్డి మా ట్లాడుతూ.. ఈ చొరవ హైదరాబాద్ వైద్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో, ప్రజలకు అంబులెన్స్ సేవలను సుల భంగా అందుబాటులోకి తీసుకురావడంలో ఒక ప్రగతిశీల అడుగు అని కొనియాడారు.