11-10-2025 05:46:29 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనపై బాధితుడు మునిగిల నాగేశ్వరరావు శనివారం ఎస్పీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఇసుక బినామీ కాంట్రాక్టర్ గంటా రమేష్ ఆకారణంగా తనపై దాడికి పాల్పడ్డాడని, అందుకు మణుగూరు సీఐ ప్రత్యక్ష సాక్షి అని, ఇసుక లారీల వేగాన్ని అదుపు చేయాలని ఆలోచనతో మాట్లాడిన తనపై దాడిగా పాల్పడ్డారని విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు పాల్గొని సంఘటనకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.