calender_icon.png 11 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదాశివపేట పట్టణంలో జగ్గారెడ్డి కందకం రోడ్డు కోసం సమీక్ష సమావేశం

11-10-2025 05:42:23 PM

పాల్గొన్న టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి..

పట్టణంలోని కందకం రోడ్డుకు 20 కోట్లు 2014లో నేనే తెచ్చిన..

ఇప్పుడు నేనే పూర్తి చేయాల్సి వస్తుంది..

ఇన్ని రోజులు మీరు ఏం చేశారని మాజీ చైర్మన్ లను ప్రశ్నించిన జగ్గారెడ్డి..

సదాశివపేట: సదాశివపేట పట్టణంలో కందకం రోడ్డు 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే, ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్ జీవో తెచ్చి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది.. 11 సంవత్సరాలలో 15 కోట్లు ఖర్చు చేశారు.. ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని, ఇన్నేళ్లు ఏం చేశారని అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్, విశ్వనాథ్ ను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గరకు వెళ్లి మేము ఎన్నిసార్లు అడిగిన ఆ కుంపటి మనకెందుకని వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబు ఇచ్చిన మాజీ చైర్మన్లు, మంత్రి హరీష్ రావు దృష్టికి సైతం కందకం రోడ్డు విషయం తీసుకెళ్ళామని నిర్వాసితుల సమస్య తీర్చమని అడిగామని జగ్గారెడ్డికి వివరించారు.

కాని తాను కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు, నా హయాంలో సదాశివపేటకు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చా అది జగ్గారెడ్డి కెపాసిటీ అని జగ్గారెడ్డి అన్నారు. కందకం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తా, ముఖ్యమంత్రిని నేనే పిలిపిస్తా కానీ నేను మాత్రం రాను నేను వంట వండుతా మీరు తినుపొండి అంతే వంట వన్డే వాడే గ్రేట్ అని జగ్గారెడ్డి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సదాశివపేట పట్టణ కాంగ్రెస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.