11-10-2025 05:55:55 PM
వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42%తో ప్రభుత్వం కల్పించాలని భావించగా ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్ దాఖలు కావడంతో హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల సంఘం హైకోర్టు తీర్పు మేరకు ఎన్నికలను నిర్వహించలేమని తెలియజేసింది. కాగా హైకోర్టు తీర్పులో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా నిర్వహించుకోవచ్చునని సూచించింది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులు ఇప్పటికే ఎన్నో నెలలుగా ఓటర్లను, క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నామని మరికొన్ని నెలలు కాపాడుకోవడం తలకు మించిన భారమవుతుందని దీంతో బరిలో ఉండాల వద్ద అని త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ లీవ్ ను దాఖలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆశావాహులను మరోసారి రాజకీయ వేడి తాకనుంది.