11-10-2025 05:50:29 PM
భైంసా: ముధోల్ నియోజకవర్గం వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు ముఠా సభ్యులను శనివారం అరెస్టు చేసినట్టు ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ముధోల్ తానూర్ మండలాల్లో ఇటీవలే వైన్ షాపుల్లో నిజామాబాద్ జిల్లా తాడు బిలోలి గ్రామాల చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి సుమారు 5 లక్షల విలువైన మద్యాన్ని దొంగతనం చేయడంతో వారిని గుర్తించి పట్టుకోవడం జరిగిందని వివరించారు. ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్ పంపడం జరిగింది అన్నారు.