11-10-2025 05:54:14 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక భగత్ నగర్ లోని అల్ఫోర్స్ హై స్కూల్ లో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలలో అల్ఫోర్స్ భగత్ నగర్ పాఠశాలకు ప్రథమ స్థానం రావడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సైన్స్ లోని విషయాల పట్ల సమగ్ర అవగాహన కల్పించడానికై అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని, అమలుపరుస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో సఫలీకృతం అవుతున్నామని తెలుపుతూ విద్యార్థులకు సృజనాత్మకంగా విశ్లేషణాత్మకంగా విషయాలను తెలిపినట్లైతే పలు పోటీలలో విజయం సాధిస్తానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.
కళాభారతి వేదికగా జిల్లా విద్య శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలలో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనరని హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు పుష్పగుచ్ఛాలు అందజేసి రాష్ట్రస్థాయిలోనూ ఘనవిజయాన్ని నమోదు చేయాలని ఆకాంక్షించారు. విజేతలైన ఎల్.అక్షంత రెడ్డి, వై.అక్షర, కే.అనిబికా, వై.హర్షిత్, కె.యశ్వంత్, ఎనిమిదో తరగతి విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.