తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్
ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అన్నారు. గురువారం నాడు జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ కు అండదండలుగా ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప బండి మోహన్, జాకీర్, దీపక్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు విజయకుమార్ , తన్జీమ్, గౌస్ గోరి, దీపక్, అప్పి రాజు, విశ్వేశ్వర్, నరసింహులు, రాథోడ్ భీమ్ ,బాలరాజ్ హీరో రాథోడ్ రాకేష్, చిన్నారెడ్డి ,గణేష్ ,కళ్లెం రవీందర్ చంద్రన్న ,ఫయాజ్, శివకుమార్ స్వామి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.






