7 August, 2026 | 2:31 AM

జొన్న రైతులకు చెక్కులను అందజేసిన మంత్రి

07-08-2026 01:24 AM

మునిపల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఇటీవల జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతుల నుంచి జొన్నలను కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే. అందుకు సంబంధించి జొన్నల పైకం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో ప్రభుత్వం జొన్నల పైకంకు సంబంధించి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడంతో రైతులకు మద్దతు ధర వచ్చిందన్నారు. జొన్నలను విక్రయించిన రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు త్వరలోనే అవుతాయని రైతులు ఎవరు కూడా అధైర్య పడకుండా ఉండాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద చెల్మెడ పిఎసిఎస్ చైర్మన్ పద్మ దుర్గయ్య, పిఎసిఎస్ కార్యదర్శి శివారెడ్డి, డైరెక్టర్లు, నాయకులు మర్పల్లి సంగన్న, అజ్జపల్లి సంజీవరెడ్డి మక్సూద్  పటేల్ తదితరులు పాల్గొన్నారు.