07-05-2025 10:09:04 PM
కరీంనగర్ (విజయక్రాంతి): మత్స్యకార మహిళ సంఘ మహిళలు 500 మంది కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో 20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ రెస్టారెంట్ ను బుధవారం మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పిట్టల రవీందర్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు పిట్టల రవీందర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, మత్స్యశాఖ అధికారులు బొమ్మ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.