12 April, 2026 | 2:34 AM

పేద కుటుంబానికి పెద్దన్నగా వీరేశం

24-10-2025 03:09 PM

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాడు 

తన వంతుగాఆర్థిక సాయం 50 వేలు అందించాడు. 

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పిన నిరుపేద కుటుంబం

నకిరేకల్,(విజయక్రాంతి): ఓ నిరుపేద కుటుంబానికి పెద్దదిక్కు పెద్దన్న లాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) నిలిచ్చారు.నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రుద్రాక్షి పుష్పయాదగిరి దంపతులకు ప్రభుత్వం ద్వారా సన్నబియ్యం అందాయి.  గతంలో సంతోషంగా నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం గుడిసె కు ఆహ్వానించి సన్నబియ్యం తో అన్నం పెట్టారు. ఆ గుడిసె లో సన్నబియ్యం తో అన్నం తిని ఆ కుటుంబానికి ఆయన అండా నిలిచాడు.

రెక్కల కష్టం నమ్ముకుని బ్రతుకీడుస్తున్న.. ఆ కుటుంబానికి.ఇందిరమ్మ రాజ్యంలో  ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేయించి తానే స్వయంగా  వెళ్లి ఆ ఆయన శంకుస్థాపన చేసి ఆ కుటుంబంలో వెలుగులు నింపాడు.అసలే పేద కుటుంబం ఇల్లు ఎలా కట్టుకుంటారని గ్రామస్థుల్ని అడిగి తెలుకున్న ఆయన తనవంతుగా కొంత సహాయం చేయాలని బావించి శుక్రవారం 50 వేల రూపాయలను ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే  వేముల వీరేశం కు  కృతజ్ఞతలు తెలిపారు.