24-10-2025 03:08:05 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో(Indiramma Housing Scheme) లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
వర్షాకాలం ముగిసినందున నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, నిర్మాణ దశల వారీగా బిల్లులు సంబంధిత లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ఉచితంగా ఇసుకను అందిస్తుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను పర్యవేక్షించాలని, ప్రతిరోజు లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిపై సమీక్షించాలని తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటి పనులు మొదలుపెట్టే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పి. డి. వేణుగోపాల్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.