calender_icon.png 24 October, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితీష్ కుమార్‌ మళ్లీ బీహార్ సీఎం కాలేరు: తేజస్వి యాదవ్

24-10-2025 02:57:47 PM

పాట్నా: జేడీ(యూ) నేతృత్వంలోని ఎన్డీఏ 20 ఏళ్లు పాలించినప్పటికీ బీహార్ రైతులు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని తాను బాధ పడుతున్నానని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) శుక్రవారం అన్నారు. పాలక కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) ముఖ్యమంత్రి కాలేరని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లోని అవినీతి నాయకులను, నేరస్థులను కేంద్రం కాపాడుతోందని మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే తాను స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఫిర్యాదులను వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వారికి అందుబాటు ధరల్లో మందులు, ఉద్యోగాలు కల్పిస్తామని మాజీ డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. 

"ఒక బిహారీగా, నా రాష్ట్రం పేదరికంలో ఉందని, నిరుద్యోగం, అవినీతి, నేర కార్యకలాపాలు పెరుగుతున్నాయని నేను బాధపడుతున్నాను. బీహార్‌లో 20 సంవత్సరాలు ఎన్డీఏ పాలనలో, 11 సంవత్సరాలు కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్ర తలసరి ఆదాయం అత్యల్పంగా ఉంది. రైతులు పేదలుగా ఉన్నారు" అని తేజస్వి యాదవ్  భక్తియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయరని కూడా ఆయన తేల్చిచెప్పారు. అంతకుముందు పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ... "బీజేపీ గుజరాత్ లో కర్మాగారాలను ఏర్పాటు చేసి బీహార్ లో విజయం సాధించాలని చూస్తోంది. ఇది జరగదు" అని సూచించారు. బీహార్‌లో ఆర్జేడీ పాలనలో ప్రబలంగా ఉన్న 'జంగల్ రాజ్'పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, "నితీష్ కుమార్ ప్రభుత్వం చేసిన 55 కుంభకోణాలను ప్రధానమంత్రి స్వయంగా వివరించారు. ఆయన ఏ చర్య తీసుకున్నారు? 'జంగిల్ రాజ్' అంటే స్కామ్‌లపై తగిన చర్యలు తీసుకోని, నేరస్థులు స్వేచ్ఛగా తిరిగే ప్రదేశం" అని తేజస్వి యాదవ్ వెల్లడించారు