calender_icon.png 24 October, 2025 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ఐవి నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

24-10-2025 03:00:36 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): హెచ్ఐవి, ఎయిడ్స్ లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నియంత్రణలో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, తెలంగాణ హెచ్ ఐ వి/ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ, అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, మంచిర్యాల , ఆసిఫాబాద్ జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నీలిమలతో కలిసి పాల్గొని కలెక్టరేట్ భవనం నుండి పట్టణంలోని బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమురంభీం ఆసిఫాబాద్ ను హెచ్ఐవి/ ఎయిడ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని, ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెచ్ ఐ వి/ఎయిడ్స్ వంటి లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా పరీక్షించుకొని సత్వర వైద్య సేవలు పొందాలని, జీవిత భాగస్వామికి కూడా పరీక్షలు చేయించాలని తెలిపారు. వ్యాధిపై బాధ్యత గల పౌరుడిగా సమగ్ర అవగాహన కలిగి ఉండి పొరుగు వారికి అవగాహన కల్పించాలని, వ్యాధిగ్రస్తుల పట్ల స్నేహభావంతో మెలిగి వారిలో ఆత్మస్థైర్యం నింపాలని తెలిపారు. వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం సహకరించాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదరించి ఆత్మవిశ్వాసం కల్పించాలని తెలిపారు. ఈ సందర్భంగా అందరిచే హెచ్ఐవి/ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పట్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.