calender_icon.png 24 October, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను పరిరక్షించాలి

24-10-2025 03:02:41 PM

ఎంసీపీఐ (యూ) సబ్ కలెక్టర్ కు వినతి - 

బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలంలో జరుగుతోన్న భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు, భూములను కాపాడాలని ఎంసీపీ (యూ)ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్(Bellampalli Sub Collector Manoj) కు వినతిపత్రం అందచేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, అద్దె భవనాలలో కొనసాగిస్తున్న ప్రభుత్వ ఆఫీసులకు పక్క భవనాలు నిర్మించాలని  సిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోరారు.

బెల్లంపల్లిలో కబ్జారాయులకు అడ్డు అదుపూ లేకుండా పోయిందన్నారు. కబ్జాదారులు స్మశాన వాటికలు కూడా వదలడం లేదన్నారు. సింగరేణి భూములు, కబ్జాలు చేస్తున్న కూడా అధికారులు చూస్తూ ఉండటం పై మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జా కోరల నుండి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని కోరారు. కబ్జా స్థలాలలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, మేకల సన్నీ, పాల్గొన్నారు.