24-10-2025 03:15:44 PM
ముత్తంగి ఓఆర్ఆర్ సమీపంలో ఘటన
పటాన్చెరు: సిద్దిపేట జిల్లాకు చెందిన వాస్తవ్యులు శంకర్పల్లిలో శుభకార్యానికి వెళ్తుండగా పటాన్చెరు ఎగ్జిట్ నంబర్ 3 సమీపంలో వారి కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్పటికే అదే దారిలో వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ వెంటనే స్పందించి కారులో ఉన్నవారిని సురక్షితంగా బయటకు దింపివేశారు. వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ప్రాణాపాయం జరగకుండా వేగంగా చర్యలు తీసుకున్న ఆయనకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.