సైబర్ భద్రత పనితీరులో తెలంగాణ ఫస్ట్
- 9 విభాగాలలో అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానం
- పీఎంవో సమావేశంలో కేంద్ర హోంశాఖ ప్రకటన
- హర్షం వ్యక్తం చేసిన టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాం తి): సైబర్ నేరాల నియంత్రణ, నిర్మూలనలో సమగ్ర పనితీరును కనబర్చిన తెలం గాణ రాష్ట్రానికి దేశంలోనే తొలిస్థానం ద క్కింది. గురువారం ప్రధానమంత్రి కార్యాలయం హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ క్రైమ్, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమ లు, వినియోగంపై నిర్వహించిన దేశవ్యాప్త సైబర్ పనితీరు ప్రగతిని సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం ఏర్పాటు, ఇజీరో ఎఫ్‌ఐఆర్ అమ లు, ఫిర్యాదుల పరిష్కారం, మనీ రిస్టోరేషన్, సహయోగ్ పోర్టల్, సమన్వయ్ పోర్ట ల్, సైబర్ క్రైమ్ హ్యాట్సాఫ్ తదితర 9 విభాగాలలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు, ప్రతిభ కనబర్చినందుకు తెలంగాణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
టీజీసీఎస్బీ ప్రకారం.. రాష్ట్ర జీఆర్‌ఎం పోర్టల్‌లో 2, 386 ఫిర్యాదులు రాగా, 2,086ను పరిష్కరించారు. 28వేల కేసులలో రూ. 16.42 కోట్లను రికవరీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎంవో సమావేశానికి హాజ రైన టీజీసీఎస్బీ డైరెక్టర్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ హాజరై, మాట్లాడారు.






