21 April, 2026 | 2:45 PM

తెలంగాణ రాష్ర్ట సాంస్కృతిక సంబురాలు

03-06-2025 12:54 AM

హైదరాబాద్, జూన్ ౨ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్ట సాంస్కృతిక సంబురాల పేరుతో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణలో ఆయా రంగాల్లో కృషి చేసిన వారిని గవర్నర్ ఘనంగా సత్కరించారు.

గవర్నర్ చేతుల మీదుగా సన్మానం పొందినవారిలో యక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఆర్సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయ్, హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బీజే రావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఎన్‌సీసీ డైరెక్టర్ కల్నల్ సమీర్ శర్మ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, జానపద కళాకారుడిగా సేవలు అందించిన అంతడుపుల నాగరాజు, జాతీయస్థాయిలో ఉత్తమ మాటల రచయితగా పేరుగాంచిన దాస్యం తరుణ్ భాస్కర్, రాఘవాచారి, చింతపల్లి వసుంధరా రెడ్డి, సీనియర్ చిత్రకారుడు సీవీ అంబాజీ, మామిడి హరికృష్ణ ఉన్నారు.