calender_icon.png 13 May, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సెయిలింగ్‌లో తెలంగాణకు 4 స్వర్ణాలు

13-05-2025 12:00:00 AM

మొత్తంగా ఆరు పథకాలతో సత్తా చాటిన రాష్ట్ర సెయిలర్లు

ముషీరాబాద్, మే 12 (విజయ క్రాంతి) : జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు బంగారు పతకాలు సాహా ఆరు పతకాలతో సత్తా చాటారని హైదరాబాద్ యాచ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుహీమ్ షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీ  లో హైదరాబాద్ రసూల్పురాలోని ఉద్భ వ్ స్కూల్ కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్-16 సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకం సాధించిందన్నారు.

మొ త్తం 9 రేసుల రెగెట్టాలో 4 రేసుల్లో మొ దటి స్థానం, రెండు రేసుల్లో రెండో స్థానం తో 13 పాయింట్లతో 2025 జాతీయ ఛాంపియన్గా నిలిచిందన్నారు. అదే స్కూ ల్కు చెందిన తనూజ కామేశ్వర్, శ్రవణ్ కత్రావత్లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో చివరి రోజు రెండు రేసులను గెలిచి నేషనల్ చాంపియన్స్ అయ్యారన్నా రు.

అండర్-15 బాలుర విభాగంలో బన్నీ బొంగూర్ బంగారు పతకం నెగ్గగా, రిజ్వా న్ మహమ్మద్ రజతం, రవి కుమార్ కాం స్యం గెలిచినట్లు చెప్పారు. మొత్తంగా అం డర్-16 సబ్ జూనియర్స్ పోడియంపైకి వ చ్చిన ఆరుగురు సెయిలర్లలో ఐదుగురు తెలంగాణ క్రీడాకారులే కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.