తెలంగాణ ‘దరువు’కు పాతికేళ్లు
ఒకవైపు తూటాల మోత.. మరోవైపు గుండెలు అదిరిపోయేలా లాఠీల చప్పుడు. నాలుగు ది క్కులా చుట్టుముట్టిన ముళ్లకంచెల మధ్య బందీ అయిన ఆశయాలు. పోలీసు నిర్బంధాలను ఛేదించి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన ఉ స్మానియా విద్యార్థుల త్యాగాలకు తెలంగాణ ప్రజానీకం ఎన్నటికీ రుణపడి ఉంటుంది. ఆ పోరా టం అత్యంత నిస్వార్థమైనది. ఆనాడు ఉస్మానియా క్యాంపస్ గోడల మీద చిం దిన ప్రతి రక్తపు చుక్కా ఒక విప్లవ గీతమై ప్రతిధ్వనించింది. బాష్పవాయువు గోళా ల మధ్య విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెట్టి పోరాడిన ఆ రో జులు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అమరవీరుల త్యాగాలను వేల సంఖ్య లో జరిగిన సభల వేదికల మీద ప్రతిధ్వనింపజేస్తూ.. దరువు సంస్థ ఆలపించిన ‘వీరులారా.. వందనం’ అనే పాట నాడు ప్రజల హృదయాల్లో ఉద్య మ పునర్జీవం పోసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోట్లాది మందిని పునరంకితులను చేసింది. అటువంటి సంక్షోభ సమయంలో కళాకారులే సైనికులై దరువు ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. పదవుల కోసం ఆశపడకుం డా, కేవలం మట్టి మీద మమకారంతో వారు రాసిన పాటలు తూటాల కంటే వేగంగా ప్రజల గుండెల్లోకి దూసుకుపోయాయి.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో దరువు సాంస్కృతిక చైతన్య వేదికది ఒక ప్రత్యేక అధ్యాయం. 1999 డిసెంబ ర్ 20న సిద్దిపేట డిగ్రీ కళాశాలలో అంకురించిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దరువు ఎల్లన్న పునాది వేయగా, రాష్ట్ర అధ్యక్షుడు దరువు అంజన్న నా యకత్వంలో ఉద్యమ గమనం మరింత ఉధృతమైంది. వీరి నేతృత్వంలో దరువు, తొలినాళ్లలోనే దళిత రత్నాలు వంటి ఆడియో క్యాసెట్ల ద్వారా సామాజిక వివక్షకు వ్య తిరేకంగా గ్రామగ్రామాన చైతన్యానికి బాటలు వేసింది. అంబేద్కర్, ఫూలే వంటి మహనీయుల ఆశయాలను పాటలుగా మలిచి ప్రజల్లోకి తీసుకెళ్లిన చరిత్ర ఈ సం స్థది.
మలిదశ ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సాగిన విద్యార్థి పోరాటాలకు దరువు గొంతుకై నిలిచింది. అమరుల త్యాగాలను స్మరిస్తూనే, చంచల్‌గూడ్ జైలు గోడల మధ్య సైతం నిరసన రాగాలను రగిలించింది. సీమాంధ్ర పాలకుల వివక్షను ప్రశ్ని స్తూ, 1200 మందికి పైగా బలిదానాల వెనుక ఉన్న వేదనను పాటగా మార్చి పల్లె పల్లెకూ తీసుకెళ్లింది. కేవలం ఆట-పాటలకే పరిమితం కాకుండా.. ‘మా తొవ్వ’, ‘ఓ యుద్ధం’, ‘వీరులారా వందనం’ వంటి పుస్తకాలు, ‘కొట్లాట’, ‘గజ్జెలమోత’ వంటి ఆడియో-, వీడియో ప్రదర్శనల ద్వారా ఉద్యమ ఘట్టాలను భావితరాల కోసం నిక్షిప్తం చేసింది. దశాబ్ద కాలానికి పైగా ఉస్మానియా గడ్డపై విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేస్తూ, తెలంగాణ రా ష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించడంలో దరువు తన సామాజిక బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది.
విద్యార్థులను ఎగిసిన నిప్పుకణాలతో పోల్చుతూ దరువు పాడిన పాటలు వారిలోని ఆవేశాన్ని, ఆశయా న్ని అద్భుతంగా ఆవిష్కరించాయి. వీరులారా వందనం పాటలోని ‘మరిచిపోము మేము.. గుండెల్లో గుడికడు తం’ అనే మాటలు అమరుల పట్ల ఉన్న అచంచలమైన గౌరవానికి ప్రతీక. ప్రభుత్వం బంధించినా, జైలు గోడల మధ్య సైతం జంగ్ సైరన్ ఊదారనే వాస్తవం విద్యార్థుల తెగింపును చాటిచెబుతుంది. ‘నువ్వు చిందించిన నెత్తురు ఊరకనే పోనియ్యం’ అనే వాగ్దానం, అమరుల ఆశయమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తీరుతామనే నిశ్చయానికి ప్రాణం పోసింది.
మలిదశ ఉద్యమంలో తమ ఉనికి ఏ మాత్రం లేని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం గొప్పలు చెప్పుకుంటుండవచ్చు. కానీ, ఆనాడు నిర్బంధాలను ఎదుర్కొంటూ, అజ్ఞాతవాసం గడుపుతూ, పోలీసు కేసులకు వెరవకుండా ఊరూరా తిరుగుతూ జనాన్ని మేల్కొల్పిన దరువు ఎల్లన్న, దరు వు అంజన్న వంటి నాయకులు, ఆ సంస్థ కళాకారుల నిస్వార్థ శ్రమ వెలకట్టలేనిది.
సంస్కృతి అంటే కేవలం వినోదం కాదు, అది ఒక జాతిని మేల్కొల్పే ఆయుధమని దరువు నిరూపించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 12 ఏళ్లు పూర్తికాబోతున్న తరుణంలో, ఆనాటి త్యాగాలను స్మరించుకోవడం మనందరి కనీస బాధ్యత. ఈ పాతికేళ్ల ప్రస్థానం కేవలం ఒక సంస్థ ప్రయాణం కాదు, అది తెలంగాణ అస్తిత్వ పోరాట చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. దరువు రగిలించిన ఆ చైతన్య దీపం భావితరాల తెలంగాణ పౌరులకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
(ఏప్రిల్ 20కి దరువు సంస్థ ఏర్పడి 25 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా)






