06-10-2025 12:16:12 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): యువభారతి సాహితీ సాం స్కృతిక సంస్థ, ఐఐఎంసి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ‘తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమం‘ పన్నెండవ సమావేశం ఎంవిఆర్ ఫౌండేషన్ సంస్థతో కలిసి లక్డీకాపూల్ లోని ఐఐఎంసి కళాశాల సభా ప్రాంగణం లో నిర్వహించారు.
సభాధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర మాట్లాడుతూ.. తెలుగు భాషా సాహిత్యాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 38 సంస్థలు మాతో కలిసి తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహించాయన్నారు. ప్రముఖ నవలా రచయిత విహారి మాట్లాడుతూ.. యువ భారతి సంస్థ అంటే క్రమ శిక్షణకు మారుపేరని, గత 62 సంవత్సరాలుగా తెలుగు భాష వ్యాప్తి కోసం ఎన్నో సా హిత్య కార్యక్రమాలను, యువతలో మానసిక అభివృద్ధిని పెంపొందించడం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేశారు.
ప్రధాన వక్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి కవి సామ్రాట్ విశ్వనాథ వారి తెలుగులో మొదటి జ్ఞానపీఠ పురస్కారం పొందిన ‘శ్రీమద్రామాయణ కల్ప వృక్షం‘ కావ్య సమాలోచనం చేశారు. కస్తూరి మురళీ కృష్ణ కె.ఎం. మున్షీ రచన అనువాదం నిజాం పాలనలో చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు గ్రంథాన్ని పరిచయం చేస్తూ అప్పటి తెలంగాణా ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థి తులను వివరించారు.
కార్యక్రమంలో ఆత్మీ య అతిథి ఐఐ ఎంసి కళాశాల ప్రాచార్యులు కూర రఘువీర్, ఎం.వి.ఆర్. ఫౌండేష న్ అధ్యక్షుడు, యువభారతి వ్యవస్థాపక సమావేశ కర్త, ఐ ఐ ఎం సి కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం, జీడిగుంట వెంకట్రావు, అమాతి రవీంద్ర, నారాయణరెడ్డి, నవీన్, ఐఐఎంసి కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు ఇ.రామకృష్ణ పాల్గొన్నారు.