06-10-2025 04:32:02 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వలిగొండ మండలంలోని ప్రిసైడింగ్ ఆఫీసర్స్, రిటైర్నింగ్ ఆఫీసర్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ, నిబంధనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీవో జి. జలంధర్ రెడ్డి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి శోభారాణి, జడ్పిటిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవి మరియు ట్రైనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.