06-10-2025 04:36:17 PM
చిట్యాల (విజయక్రాంతి): నార్త్ అమెరికా ఖండంలోని బార్బడోస్ దేశ రాజధాని బ్రిడ్జిటౌన్ లో జరిగే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి సోమవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అధికారులు బయలుదేరారు. అక్టోబర్ 11వ తేదీ వరకు జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం స్టడీ టూర్లో భాగంగా యునైటెడ్ కింగ్ డమ్, ఫ్రాన్స్, ఇటలి దేశాలలో తెలంగాణ శాసనమండలి బృందం పర్యటించనుంది.