calender_icon.png 5 May, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

28-04-2025 12:19:40 AM

బిచ్కుంద, ఏప్రిల్ 27: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. ఎన్ని సార్లు పోలీసులు కేసులు పెట్టినా ఇసుకాసురులు తీరు మారడం లేదు. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామ శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా పది ట్రాక్టర్లు ఇసుక ను ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా కందర్ పల్లి చౌరస్తా వద్ద   ఇసుక ట్రాక్టర్లను బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు.

ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేసి విచారణ చేపట్టమన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సు మోహన్ రెడ్డి  హెచ్చరించారు. పట్టుకున్న ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచినట్లు ఎస్సు తెలిపారు.