03-07-2025 06:23:05 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకులం(Telangana Social Welfare Gurukulam)లో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్స్ డాక్టర్ యశ్వంత్ చంద్ర, డాక్టర్ వంశీ విద్యార్థులు పరీక్షించి అవసరమైన మందులను అందజేశారు. అలాగే ఆప్తమాలజిస్ట్ డాక్టర్ అంజయ్య విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు అరుణ సుందరి మాట్లాడుతూ... లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు. ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య శిబిరం వల్ల విద్యార్థులు మరింత ఆరోగ్యంగా ఉండి చదువులో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్తారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ఆదర్శ వర్ధన్ రాజు, విమెన్ ఎంపవర్మెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎర్ర సువర్ణ, మెడికల్ కోఆర్డినేటర్ సిహెచ్ సుదర్శన్ సభ్యులు ప్రభాకర్, సమ్మయ్య, నరసయ్య మహేశ్వర్ రెడ్డి, జయ చందర్ తదితరులు పాల్గొన్నారు.