03-07-2025 06:19:33 PM
బెదిరింపుతోనే యువకుడు ఆత్మహత్య..
ప్రశ్నించే గొంతుకలను పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య..
బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి..
ములుగు (విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి(Constituency In-charge Bade Nagajyothi) అన్నారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ మృతదేహాన్ని ములుగు నియోజకవర్గ ఇంచార్జి & మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఏటూరునాగారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి మాట్లాడుతూ... ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విషయంలో అక్రమాలు వాట్సాప్ వేదికగా ప్రశ్నించినందుకు తనపై తప్పుడు కేసు పెట్టారని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న చుక్కా రమేష్ మనస్థాపనతో చనిపోయాడని సూసైడ్ నోటు రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అతని రాసిన సూసైడ్ నోటులో గ్రామంలో ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకుల వల్ల నేను చనిపోతున్నా అని రాయడం దురదృష్టకరం అని అన్నారు.
వాట్సాప్ గ్రూపులో ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై రెండు నెలలుగా ప్రశ్నిస్తున్నాడని ఆమె తెలిపారు. నిన్న వాట్సాప్ గ్రూప్ లో సీతక్క మన గ్రామంలో పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని అడిగినందుకు కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు గురిచేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తన ఆత్మహత్యకు కారణమయ్యారని ఆమె అన్నారు. ప్రశ్నించే గొంతుకలను పోలీసులు అరెస్టు చేయడం హేయమైన చర్య భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు గురిచేసిన కూడా పోరాటం ఆపేది లేదని అన్నారు. వారి చావుకు కారణమైన వెంటనే అరెస్టు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.