10-07-2025 07:50:44 PM
హరియాణా: సోషల్ మీడియా వీడియో విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో 25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిని తండ్రియే కాల్చి చంపిన ఘటన గురుగ్రామ్‌లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే... గరుగ్రామ్ కు చెందని రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదమ్(25) అనే యువతి సోషల్ మీడియా కోసం చిత్రీకరించిన వీడియో రీల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండేది. ఆమె విడియోలు చూసిన తన తండ్రి సోషల్ మీడియాలో వియోలు పెట్టోదని ఎన్నిసార్లు మందలించారు. అయిన వినకపోవడంతో గురువారం కూడా అదే తరహలో తండ్రి కుమార్తెకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ పోస్ట్‌తో కోపంగా ఉన్న తండ్రి తన లైసెన్స్ డ్ రివాల్వర్‌ను తీసి రాధికపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
అది గమనించిన కుటుంబ సభ్యులు రాధికను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది.తుపాకీ గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఒక యువతి గురించి మాకు ఆసుపత్రి నుండి పోలీసులకు సమాచారం అందిందని సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేందర్ కుమార్ తెలిపారు. తాము అక్కడికి చేరుకునే సమయానికి ఆమె మరణించిందన్నారు. ఈ సందర్భంగా గురుగ్రామ్ పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ... , రాధిక యాదవ్ సోషల్ మీడియా కోసం చిత్రీకరించిన వీడియో రీల్ ఇంట్లో ఉద్రిక్తతకు దారితీసిందని తన ప్రాథమిక దర్యాప్తులో తెలిందన్నారు. ఈ సంఘటన ఉదయం 11:30 గంటలకు వారి ఇంటి మొదటి అంతస్తులో జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేసి తన లైసెన్స్ డ్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఘటనకు సంబంధించి బంధువులు, పొరుగువారిని ప్రశ్నిస్తున్నారు. వివరణాత్మక ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, నేరం జరిగిన సమయంలో నిందితుడి మానసిక స్థితిని అంచనా వేయడానికి అతని మానసిక అంచనాను ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు రాధిక యాదవ్ హర్యానాకు అనేక రాష్ట్ర స్థాయి టెన్నిస్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి స్థానిక క్రీడా రంగంలో ఒక వర్ధమాన తారగా నిలించిదన్నారు. గతంలో రాధికకు కోచ్‌గా పనిచేసిన మనోజ్ భరద్వాజ్ ఆమె మరణం తనకు చాలా పెద్ద లోటు అని భావోద్వేగానికి లోనయ్యారు. మృతురాలి దృష్టి, క్రమశిక్షణ, అపారమైన ప్రతిభావంతురాలు అని స్పష్టం చేశారు.