calender_icon.png 1 May, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ జిల్లా టాపర్ నయన

01-05-2025 01:03:38 AM

పది ఫలితాల్లో 15వ స్థానంలో నిర్మల్ జిల్లా 

నిర్మల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి ర్యాం క్ సాధించగా.. ఈ ఏడా ది మాత్రం 96.70 ఉత్తీర్ణత శాతంతో 15 స్థానంలో నిలిచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు.

జిల్లాలో ఈ విద్యా సంవత్సరం మొత్తం 9123 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 8822 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పట్టణంలోని వాసవి పాఠశాలకు చెందిన నల్ల నయన 600 మార్కులకు 589 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆయన తెలిపారు. పరీక్ష ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.