calender_icon.png 6 January, 2026 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యస్థంగా టెట్ పేపర్ ప్రశ్నలు

04-01-2026 01:11:42 AM

తొలిరోజు పరీక్షకు 7,245 మంది గైర్హాజరు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): టెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్2 ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షల ప్రశ్నల సరళి మధ్యస్థంగా వచ్చింది. కొన్ని విభాగాల్లోని ప్రశ్నలు తేలికగా, మరికొన్ని విభాగాలు కొంత కఠినంగా వచ్చాయి. తెలుగు విభాగంలో ప్రశ్నల సరళి కాస్త తేలికగా వచ్చాయి. ఇంగ్లిష్ విభాగం గ్రామర్‌లో ప్రశ్నలు ఎప్పటిలాగే కఠినంగా వచ్చాయి.

సైకాలజీలో ప్రశ్నల సరళి కొంత తేలిక, కొంత కఠినంగా వచ్చాయని అభ్యర్థులు తెలిపారు. ఇక బయాలజీ అభ్యర్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు వారు చేయగలిగిన విధంగానే ఉన్నా యని తెలిపారు. ఇక మెథడాలజీ విభాగం లో ప్రశ్నల సరళి తేలిగ్గానే వచ్చాయి. మొత్తం గా చూసుకుంటే ప్రిపేర్ అయిన అభ్యర్థుల కు ఈ పరీక్షల్లో 80 నుంచి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిష్, మ్యాథ్స్ ఎక్కువ చేసిన వారికి 100 మార్కులపైనే రావడానికి ఆస్కారం ఉంది. 

ఇన్ సర్వీస్ టీచర్లు సైతం టెట్ పరీక్షలు రాస్తున్నారు. అయితే తొలి రోజు పరీక్ష కొం త కఠిన ప్రశ్నల సరళిని చూసి టీచర్లు ఇబ్బం ది పడినట్లు తెలిసింది. 60 నుంచి 75 పాస్ మార్కులు ఉన్న కేటగిరీ అభ్యర్థుల్లో కొంత ఎక్కువ సంఖ్యలో పాస్ అయ్యే అవకాశం ఉంది. 90 మార్కులకు పాస్ అర్హత ఉన్న కే టగిరీ అభ్యర్థులకు ఇబ్బంది ఉండేలా ప్రశ్న ల సరళిని చూస్తే తెలుస్తోంది. ఇదిలా ఉంటే నేడు కూడా టెట్ పరీక్ష జరగనుంది.

మొత్తం 35,461 మందికి తొలిరోజు ఉద యం సెషన్‌లో 14,089 మంది, మధ్యా హ్నం సెషన్‌లో14,127 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 7,245 మంది గైర్హాజరయ్యారు. సెషన్1లో 80.03శాతం, సెష న్ 2లో79.12 శాతం హాజరు నమోదైంది.