calender_icon.png 22 July, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కావూరిహిల్స్ శ్రీచైతన్యలో ఫ్రెషర్స్‌డే

22-07-2025 12:23:49 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): 40 ఏళ్లుగా విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు ‘రోర్ రైజ్ ఆఫ్ అచీవర్స్, రాక్‌స్టార్స్ పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను శ్రీచైతన్య కావూరి హిల్స్ జోన్ ఘనంగా నిర్వహించింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించి న ఈ వేడుక విద్యార్థుల్లో ఉత్తేజాన్ని, నూతన ఆశయాలనునింపింది.

శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ బొప్పున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ‘ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. శ్రీచైతన్య అందిస్తున్న ప్రపంచస్థాయి విద్యా వేదికను మెరుగైన రిజలట్స్ కోసం సద్వినియోగం చేసుకోవాలి’ అని అన్నారు.

ఏటా ఐఐటీ, నీట్, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీల్లో శ్రీచైతన్య విద్యార్థులు సాధిస్తున్న అఖండ విజ యాలు, నాసా వంటి అంతర్జాతీయ స్థాయి లో విజేతలుగా నిలుస్తున్న విద్యార్థుల ప్రతిభాపాటవాలు గురించి ప్రశంసలు గుప్పిం చారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి పాల్గొని విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు.

మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ జీ ప్రత్యేక అతిథిగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్నన్ గెస్ట్ ఆఫ్ హానర్‌గా సందడి చేశారు. సినీ నటుడు హైపర్ ఆది గెస్ట్‌గా హాజరై విద్యార్థులతో తమదైన శైలిలో నవ్వు లు పంచుకున్నారు. ఈ వేడుక ద్వారా విద్యార్థుల్లో భవిష్యత్ లక్ష్యాలపై మరింత స్పష్టత, ప్రేరణ అందించాలని నిర్వాహకులు వెల్లడించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, విజయోత్సాహాన్ని ప్రతిబింబించే కార్యక్రమా లు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.