28-01-2026 01:16:08 AM
ఖమ్మం, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026 డైరీని అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి, కార్యవర్గ సభ్యులు మంగళవారం ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కు అందజేశారు.
ఐడిఓసిలోని జిల్లా అధికారులైన సన్యాసయ్య డీఆర్డీవో, రాంబాబుకు జి ల్లా పంచాయతీరాజ్ అధికారి, చైతన్య జైని డిఇఓ, నవీన్ బాబు ఎస్సీ కార్పొరేషన్, గుడి కందుల జ్యోతి డిప్యూటీ డైరెక్టర్, కే చందన్ కుమార్ సివిల్ సప్లై అధికారి, ఏంవి మధుసూదన్ ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి, మహమ్మద్ ముజాహిద్ మైనారిటీ అధికారి, జి శేఖర్‌రెడ్డి మిషన్ భగీరథ సూపరిండెంట్ ఇంజనీర్, డి పుష్పలత వై వాణిశ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఎం యాకోబ్ పర్యవేక్షక ఇం జనీర్ ఆర్ అండ్‌బి, ఎన్ విజయలక్ష్మి డిప్యూ టీ డైరెక్టర్, డి శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్, యుమహేష్ బాబు జిల్లా పంచాయతీ రాజ్ అధికారి, గుర్రాల వెంకటరెడ్డి సూపర్డెం ట్ ఇంజనీర్, డాక్టర్ విజేత వేల్పుల డిప్యూటీ డైరెక్టర్, డి పుల్లయ్య వ్యవసాయ అధికారి, మహమ్మద్ అబ్దుల్ అలీ జిల్లా మార్కెటింగ్ అధికారి, జి నాగేందర్ రెడ్డి ఎక్సైజ్ సూపర్‌ండెంట్, వివిధ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులకు, గెజిటెడ్ అధికారులకు డైరీ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు, హౌస్ బిల్లింగ్ సొసై టీ సెక్రటరీ డాక్టర్ పి విజయ్ కుమార్, హెచ్‌ఎంస్ అసోసియేషన్ అధ్యక్షులు రాయల వీరస్వామి పాల్గొన్నారు.