calender_icon.png 26 July, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీకి ఆమే మహాలక్ష్మి అయింది

24-07-2025 12:00:00 AM

 ఖమ్మం రీజియన్ లో 7.38 కోట్ల మహిళల ప్రయాణం

ఖమ్మం, జులై 23 (విజయ క్రాంతి): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఖమ్మం రీజియన్ బస్సుల్లో 7, 38,14,405 మహిళలు ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకాన్ని 2023 డిసెంబర్ 9 అమల్లోకి తెచ్చింది. నాటి నుండి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. ఖమ్మం రీజియన్ లో 7 బస్ డిపోలు ఉన్నాయి. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు. ఈ ఏడు డిపోలలోని బస్సుల ద్వారా 7, 38,14,405 మహిళలు ప్రయాణం చేయడంతో 33,108.80 లక్షల ఆదాయం ఆర్టీసీకి వచ్చింది.

ఈ ఏడు డిపోల్లో అత్యధికంగా సత్తుపల్లి డిపోలోని బస్సుల్లో 1,73,32,735 మంది మహిళలు ప్రయాణించగా 6,143 లక్షల ఆదాయం లభించింది. ఖమ్మం డిపో బస్ లల్లో 1,68,28,069 మహిళలు ప్రయాణించగా 8142 లక్షల ఆదాయం లభించింది. మణుగూరు డిపో బస్సుల్లో 1,12,33,835 మంది మహిళలు ప్రయాణించిగా 4809 లక్షల ఆదా యం లభించింది. కొత్తగూడెం డిపో లోని బస్సుల్లో 1.06,83,004 మంది మహిళలు ప్రయాణించగా 4062 లక్షల ఆదాయం లభించింది.

భద్రాచలం డిపో లోని బస్సుల్లో 82,99,912 మం ది మహిళలు ప్రయాణించగా 4114 లక్షల ఆదాయం లభించింది. మధిర డిపోలోని బ స్సుల్లో67,76,202 మంది మహిళలు ప్రయాణించగా 4869 లక్షల ఆదాయం లభించింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో మహిళలు ప్రయాణం చేయడం ద్వారా ఆర్టీసీకి వరం అయింది. మంగళవారం నాటికి రాష్ట్రం మొత్తం లో ఈ పథకం ద్వారా రెండు కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. దీంతో ప్రభుత్వం అన్ని బస్ డిపోల్లో బుధవారం వేడుకలు నిర్వహించారు.