24-07-2025 12:00:00 AM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నకిరేకల్ జులై 23 (విజయకాంత్రి) : రామన్నపేటలో ఆదాని అంబుజా సిమెంటు పరిశ్రమ నెలకొల్పితే ప్రతిఘటిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.బుధవారం ఆయన హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళుతున్న క్రమంలో రామన్నపేట సుభాస్ సెంటర్లో సిపిఎం మండల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ దేశీయ బడా పెట్టుబడిదారునైనా ఆదాని సిమెంట్ పరిశ్రమ నెలకొల్పి పచ్చని పల్లెల్లో కాలుష్య భూతాన్ని పెంచి పోషించాలని చూస్తే కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాటు శివకుమార్,డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు శానకొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, ఆముద ఆంజనేయులు, భావనలపల్లి సత్యం,కునూరు గణేష్, రాసాల రమేష్, పొట్లచెరువు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.