25-10-2025 10:11:36 PM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడులోని అంబేద్కర్ కాలనీకి చెందిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు 228 బూత్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ సమస్యలపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేద్కర్ కాలంలోని సమస్యలను పరిష్కరిస్తానని కావలసిన సీసీ రోడ్లు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. కిన్నెరసాని రహదారికి నూతన రోడ్డు ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. కాలనీలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.