25-10-2025 10:03:17 PM
ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి
కొత్తగూడెం, (విజయక్రాంతి): సింగరేణిలో ఉన్న ట్రాన్స్ఫర్ పాలసీని మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) పలు మార్లు యాజమాన్యం తో చర్చించి ఒప్పించి కార్మికుల వ్యక్తిగత, మ్యూచ్వల్, స్పౌస్, హెల్త్ గ్రౌండ్ ప్రాతిపదికన శనివారం 114 మందికి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు ఇప్పించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు.
సింగరేణి లో కార్మికులు ఎవరైతే పని చేస్తున్న ప్రదేశంలో 3 సం. ల సర్వీస్ ఉండి ఖాళీ ఉన్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోరుకున్న వారికి, మ్యూచ్వల్ ట్రాన్సఫర్ పెట్టుకున్న వారికి, స్పౌస్ కేస్ లో ఖాళీలను బట్టి, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖాళీలు ఉన్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోరిన వారికి శనివారం సింగరేణి యాజమాన్యం ట్రాన్సఫర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ట్రాన్స్ఫర్ పాలసీలో మ్యూచ్వల్
ట్రాన్సఫర్ కి కూడ మూడు సంవత్సరాల సర్వీస్ నిబంధన ఉండేదని, ప్రస్తుతానికి మూచ్యువల్ ట్రాన్స్ఫర్ పై 3 సంవత్స రాల నిబంధనను, స్పౌస్ కేసు ఖాళీల ప్రాతిపదికన వీటిని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి, వారికి కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ మూడు సంవత్సరాలు దాటిన వారికి ఖాళీల ప్రాతిపదికన వారికి కూడ ట్రాన్సఫర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ విదంగా ట్రాన్సఫర్ ఆర్డర్లు ఏఐటీయూసీ కృషి ఫలితంగా విడుదల అయినాయని ఆయన పేర్కొన్నారు.