25-10-2025 12:08:47 AM
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందుశర్మ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా చిత్రబృందం కొత్త షెడ్యూల్ కోసం శ్రీలంకకు బయలుదేరారు. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీపై ఒక పాటను చిత్రీకరించనున్నారు. 2026 మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.