28-12-2025 12:00:00 AM
కుషాయిగూడ, డిసెంబర్ 27 (విజయక్రాంతి) : పారిశ్రామిక వాడలోని వెట్ ఇండియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన జరిగింది. ఎస్త్స్ర సాయిలు, స్థానికుల కథనం ప్రకారం వెంకట్రావు (45) అనే కార్మికుడు శనివారం ఉదయం కంపెనీలో పనిచేస్తుండగా. ప్రమాదవశాత్తు మిషన్ పై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో వెంకట్రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తోటి కార్మికులు, పరిశ్రమ యాజమాన్యం స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించినట్లు సమాచారం.
దీంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని వెట్ ఇండియా కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కుషాయిగూడ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతి చెందిన కార్మికుని కుటుంబానికి వెట్ ఇండియా కంపెనీ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించినట్లు సమాచారం.