10-12-2025 08:01:52 PM
సంస్థాన్ సర్పంచ్ అభ్యర్థి అంతటి భాగ్యలక్ష్మి
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తనను ఆదరించి ఆశీర్వదిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అంతటి భాగ్యలక్ష్మి అన్నారు. స్థానికంగా నివాసం ఉంటూ మహిళలను చైతన్యపరుస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషిచేసిన మహిళగా అందరిలో గుర్తింపు తనకు అదనపు బలం అన్నారు.
మహిళలంతా తన వెంట నడుస్తూ స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొనడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. గ్రామంలో బస్టాండు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కారం, యువతకు జిమ్ ఏర్పాటు, మండల కేంద్రానికి వచ్చే ప్రజల కోసం మరుగుదొడ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నారాయణపూర్ గ్రామస్తులను అభ్యర్థించారు.