calender_icon.png 13 November, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

13-11-2025 05:21:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా గౌడ కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మోకు దెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నరస గౌడ్ అన్నారు. గురువారం నిర్మల్ లో ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులకు కళ్ళు గీతా వృత్తి నిర్వహించుకున్నందుకు ఈత వనాల కోసం సర్వేనెంబర్ 51 లో 5 ఎకరాలు కేటాయించాలని ఆ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే అన్ని జిల్లాల్లో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమస్యల నాయకులు రాజేంద్ర గౌడ్ వెంకటేష్ గౌడ్ దశ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.