calender_icon.png 13 November, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం

13-11-2025 05:14:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పోక్సో నిందితుడి కోర్టు సరెండర్ నేపథ్యంలో పోలీసులు న్యాయవాదులపై దాడి చేసి కారును ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ మల్లారెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాదులతో కలిసి మాట్లాడారు. పోక్సో చట్టంలో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని నలభై రోజులపాటు పట్టుకోలేని పోలీసులు న్యాయవాది సమక్షంలో లొంగుబాటు సిద్ధమైతే న్యాయవాదిపై స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించాలని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయవాదులకు పోలీసులంటే గౌరవమని పోలీసుల పట్ల తాము దురుసుగా ప్రవర్తించినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు న్యాయవాదుల సంఘం ఆదురులో నిరసన తెలుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.