calender_icon.png 13 November, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ శతజయంతి ముగింపు ఉత్సవాలను విజయవంతం చేయండి

13-11-2025 05:19:08 PM

మందమర్రి (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పురుడు పూసుకుని నేటికీ 100 సంవత్సరాలు గడు స్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న పార్టీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనా ధుని సుదర్శన్, పట్టణ కార్య దర్శి కామెర దుర్గారాజులు కోరారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శత జయంతి ఉత్సవాల కరప త్రాలు, పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు.

కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, కార్మికవర్గం,  భూమి కోసం, భుక్తి కోసం, వీరోచిత పోరాటాలు చేసి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పా టు చేసిందని వారు గుర్తు చేశారు. భారత ప్రజానీకం కోసం ఎందరో కమ్యూనిస్టుయోధులు ప్రాణ త్యాగం చేసి చరిత్రను సృష్టించారని వారి సేవలను కొనియాడారు. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటంతో బాంచను దొర అన్న ప్రజలచే బందూకులు పట్టించి భూస్వా ములకు వ్యతిరేకంగా పోరాటా లు నిర్వహించి పేదలకు భూములు ఇచ్చిన ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుంద న్నారు.పార్టీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించు కొని డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో 5 లక్షల మంది చే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.

శతజయంతి ఉత్సవాల విజయవంతం కోసం ఈనెల 15 న కొమురం భీం జిల్లా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు బస్సు జాత నిర్వహిస్తున్నామని,ఈ జాత ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రారంభిస్తారన్నారు, జాతీయ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు, కలవేన శంకర్, సింగరేణి విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యల సారథ్యంలో జరుగుతున్న జాతలో ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిపిఐ నాయకుడు రాయబారపు వెంకన్న, బండారి రాజేశం, అంతోని దినేష్, జెట్టి మల్లయ్య, తాళ్లపెళ్లి వీరన్న, కలువల శ్రీనివాస్, ఎండి రసూల్, గడ్డం సంతోష్, హమాలి సంఘం నాయకులు సంపత్, పూరెళ్ళ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.