calender_icon.png 17 August, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతును రాజు చేసే లక్ష్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

30-11-2024 11:18:24 PM

ఇల్లెందు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలోని కోయగూడెం క్లస్టర్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో గల రైతు వేదికలో రైతుల పండగ కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు  రైతులు పూలాభిషేకం చేశారు. అనంతరం మహబూబాద్ నగర్ జిల్లా నుంచి ప్రసారమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతుల పండుగ కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య  రైతులతో కలిసి వీక్షించారు.

అనంతరం మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క సంవత్సరంలోనే 55 వేల కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చుపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రైతులను పట్టించుకోవడం చేతకాని బిజెపి ప్రభుత్వాలకు ఎన్నికలు వచ్చాయంటే రైతులు గుర్తుకొస్తారని అన్నారు. పట్టుమని లక్ష రూపాయలు రుణమాఫీ చేయటం చేతకాని బిఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మండల పలువురు అధికారులు, డిఏ ఓ బాబూరావు, మార్కెటింగ్ డిఎం నరేందర్, సివిల్ సప్లై డిఎం త్రినాధ్ బాబు, ఎంపీడీవో రవీందర్రావు, ఎంపీఓ గాంధీ, ఏడిఏ లాల్ చంద్, మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, ఏఈఓ లు ప్రవీణ్, శ్రావణి, భాగ్యశ్రీ, రెహానా, జిల్లా టెక్నికల్ ఏవో సాయి నారాయణ, రామకృష్ణ, నాగయ్య సొసైటీ డైరెక్టర్స్ శ్యంబాబు, ఉదయ్, మోహనరావు. మార్కెట్ డైరెక్టర్స్ సమ్మక్క, మలోత్ శివ తదితరులు పాల్గొన్నారు.