calender_icon.png 17 August, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుడికి అండగా నిలిచిన ఫీల్డ్ అసిస్టెంట్లు

30-11-2024 11:12:45 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్, జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షులు లింగయ్య ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్ద చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మండలంలోని తోటి ఫీల్డ్ అసిస్టెంట్లు శనివారం ఆయన నివాసంలో బాధితుడిని పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడ్డ లింగయ్య త్వరగా కోలుకొవాలని కోరారు. ఈ సందర్బంగా వారు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అధైర్య పడవద్దని ఆన్నారు. కాగా పరామర్శించిన వారిలో ఫీల్డ్ అసిస్టెంట్లు లింగాల రాజేందర్, భూమా, సత్యం, పుస్తే రవి, శంకరయ్య, బాపు రవి, రాజన్న, సత్యనారాయణలు ఉన్నారు.