23-01-2026 12:00:00 AM
చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్
చెన్నూర్, జనవరి 22 : చెన్నూర్ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నాయకులు అస త్య ఆరోపణలు చేస్తున్నారని చెన్నూర్ మార్కె ట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం చెన్నూరులో ఆయ న మాట్లాడారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం అభివృ ద్ధి చేసిందని ప్రశ్నించారు. చెన్నూరు నియోజక వర్గం కేంద్రంలో ఆటోలు వెళ్లలేని గల్లీలు ఉండేవనీ, మంత్రి వివేక్ వచ్చాక అన్ని వాడ ల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్‌లు కట్టించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినము అని గొప్పలు చెప్పుకునే బిఆర్‌ఎస్ నాయకులు ఒక ఎకరాకు కూడా నీళ్లు అందించలేదన్నారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినప్పుడు సుమన్ ఎక్కడ పోయా డు అని ప్రశ్నించారు. మరో సారి మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.