calender_icon.png 23 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారుల కుటుంబాలకు అండగా బీఆర్‌ఎస్

23-01-2026 12:00:00 AM

వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ

ఖమ్మం, జనవరి22 : తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. అందులో భాగంగా ముందుగా  కారేపల్లి మండల వాస్తవ్యులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, జడల వెంకటే శ్వర్లు మృతి చెందిన విషయం తెలిసిందే, ఈ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి సతీమణి మాజీ ఎంపీటీసీ జడల వసంత, కుమారుడు జడల కళ్యాణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం కారేపల్లి మండలం గాదపాడు గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచెపల్లి కృష్ణారెడ్డి  భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. రఘునాథపాలెం మండలం, చింతగుర్తి గ్రామంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్, దిశా కమిటి మాజీ సభ్యులు మెంటెం రామారావు మాతృమూర్తి శకుంతుల  దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  ఖమ్మం వీడియోస్ కాలనీ నందు ఇటీవల మరణించిన మోతుకూరి పుల్లయ్య నివాసానికి వెళ్లి వారి కుమారుడు గోపాలరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మాజీ ఎంపీ నామ వెంట రఘునాథపాలెం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, కార్పొరేటర్ జ్యోతిరెడ్డి, నాయకులు తాతా వెంకటేశ్వర్లు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వరరావు, కనకమేడల సత్యనారాయణ, మోరం పూడి ప్రసాద్ రావు, గొడ్డేటి మాధవరావు, ముత్యాల సత్యనారాయణ, వున్నం వీరేందర్, రమేష్, రావూరి శ్రీను, బత్తుల శ్రీను, డి రవీందర్, మోతుకూరి పాపారావు, సిరిపురపు సంపత్, కనక మేడల గోపాల కృష్ణమూర్తి, వెంగళం శ్రీను, వాకదాని కోటేశ్వరరావు, అన్వేష్, కనగళ్ళ శ్రీకాంత్, రామకృష్ణ, నునావత్ రవి, లక్ పతి, రేగళ్ల కృష్ణప్రసాద్ స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.