12 March, 2026 | 9:00 AM

వీరయ్య చేసిన ఆరోపణలు అవాస్తవం

10-10-2024 12:49 AM

బీఆర్‌ఎస్ నేత డాక్టర్ వాసుదేవరెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): దివ్యాంగుల కార్పొ రేష న్ చైర్మన్ వీరయ్య తనతో పాటు హ రీశ్ రావు, కొప్పుల ఈశ్వర్‌పై చేసిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్‌ఎస్ నేత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తెలం గాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే శక్తి లేక.. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ నాయకులపై మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ది వ్యాంగుల స్కీమ్ అమలు ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకంగా జరిగింద న్నారు. పరికరాల కొనుగోలులో ఏదైనా అవినీతి జరిగితే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.