15 April, 2026 | 5:18 AM

జాతీయ అధ్యక్షుడి రాకతో శ్రేణుల్లో నూతనోత్సాహం

05-02-2026 01:39 AM

బీజేపీ నేత పద్మ వీరపనేని

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణకు బిజెపి నూతన జాతీయాధ్యక్షుడు రావడంతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని బిజెపి మహిళా మోర్చా జాతీ య కార్యవర్గ సభ్యురాలు, బిజెపి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని అన్నారు. తొలిసారిగా తెలంగాణకు విచ్చేసిన నితీశ్ నమిటీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తన ప్రచార షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా బుదవారం తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆయనకు పద్మ వీరపనేని వీడ్కోలు పలికారు. అనంతరం మాట్లాడుతూ నూతన యువ నాయకత్వంలో, సీనియర్ల అనుభవంతో పార్టీ మరింత పటిష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.