18 March, 2026 | 12:24 PM

Breaking News

రాజ్యసభ ఎంపీలకు ప్రధాని మోదీ వీడ్కోలు   •   మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •  

కళలు మానసిక ఆనందాన్నిస్తాయి పలుస శంకర్ గౌడ్

18-03-2026 12:00 AM

పెబ్బేర్ మార్చి 17: కళలు, సాహిత్యం మానసిక ఆనందాన్ని కలిగిస్తా యని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో మంగళవారం పెబ్బేర్లో వనపర్తి జిల్లా రంగస్థల కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు,

ప్రజల కోసం అన్న నానుడిని అనుసరించి కళాకారులు ప్రజల ఆనందం, మానసిక ఉల్లాసం కోసం తమ కళలను ప్రదర్శిస్తారని తెలిపారు. జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్. ఉమామహేశ్వర్, కార్యదర్శి సర్వారెడ్డి, సితార వెంకటేశ్వర్లు తదితరులను శంకర్ గౌడ్ శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, రాములు, గోవర్ధన్ చారి, శ్రీనివాస్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.